Monday 12 March 2012

జాతీయ చిహ్నలు

భారతదేశ జాతీయ చిహ్నల భారతీయత తో ఏకాత్మకంగానూ, ప్రాచీన సంపదగానూ స్వాభావికంగా కలిసిపోయేవి. ప్రపంచ నలుమూలలలో విస్తరించిన అన్ని వర్గాల, నేపధ్యాల భారతీయులు తమ హృదయంలో దేశభక్తి, ఆత్మగౌరవం, కలుగజేసే ఈ జాతీయ చిహ్నలను చూసి గర్విస్తారు.

 జాతీయ జెండా

National Flag జాతీయ జెండా సమాంతరంగా (అడ్డంగా) విస్తరించి ఉండే మూడు రంగుల సమ్మేళనం. పైన కాషాయ వర్ణంలోనూ, మధ్యలో తెలుపు వర్ణంలోనూ, క్రింద ముదురాకు పచ్చలోనూ సమానమైన ప్రమాణంతో ఉంటుంది. జెండా యొక్క వెడల్పు, దాని పొడవులో 2. : 3 నిష్పత్తిలో ఉంటుంది. జెండాలోని తెలుపు పట్టీలో ముదురు నీలం రంగు చక్రం ఉండి, అది దేశభక్తి కి ప్రతీకగా ఉంటుంది. ఈ చక్రం యొక్క నమూనా అశోకుడి సార్వనాధే సింహస్ధూపం (సార్వనాధే లియన్ కేపిటల్) యొక్క స్తంభ ఫలకం పై నున్న చక్రం నుండి తీసుకొనబడింది. దీని యొక్క వ్యాసం, జెండాలోని తెల్లభాగం యొక్క వెడల్పుతో దాదాపు సమానంగా ఉండి 24 కమ్మీలు ( ఆకులు) కలిగి ఉంటుంది. జాతీయ జెండా యొక్క నమూనాను, భారత సంవిధాన సభ (కాన్స్టిట్యూటియన్ట్ అసెంబ్లీ ) 22 జూలై 1947లో ఆమోదించింది. ప్రభుత్వం శాసనాలు కాని నిబంధనలు ఎప్పటి కప్పుడు సవరించబడి, వాటి కనుగుణంగా, జాతీయ జెండా ప్రదర్శన నియంత్రిచబడింది. (చట్టం) నియమావళి, 1950 ( నవంబరు 12, 1950) మరియు జాతీయ గౌరవం ఎడల అవమానాలను నిరోధించే చట్టం, 1971 ( 1971 యొక్క నంబరు 69) లకు లోబడి జెండా ప్రదర్శన ఉంటుంది. భారత జెండా నిబంధనలను, రివాజులను ఒకే చోటికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఈ విషయం సంబంధించిన వారందరికీ సూచించడానికి ఇది ఉపయోగపడుతుంది.
భారత జెండా నిబంధనలన (ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా), 2002 జనవరి 26, నుండి అమలులోకి వచ్చి, అప్పటి వరకూ ఆచరణలో ఉన్న జెండా నిబంధన – భారత్ యొక్క (ఫ్లాగ్ కోడ్- ఇండియా) ను రద్దు చేసింది. భారత జెండా నిబంధన 2002 లోని నియమాల ప్రకారం, సామాన్య ప్రజానీకం, ప్రైవేట్ సంస్ధలు, భారత జెండా ను ప్రదర్శించడానికి ఎటువంటి పరిమితులూ లేవు కాని, చిహ్నలు మరియు నామాలు (ద ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ ) అనుచితమైన వాడకాన్ని నిరోధించే చట్టం 1950ప్రకారం మరియు జాతీయ గౌరవానికి జరిగే అవమాన నిరోధక చట్టం 1971, లేక యింకా ఏదైనా ఈ విషయానికి సంబంధించి తీసుకుని వచ్చిన చట్టానికి లోబడి ఈ అవకాశం ఉంటుంది. ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా (భారత జెండా నిబంధన) గురించి మరింత తెలుసుకొనండి.

జాతీయపక్షి

National-Bird.gifభారతజాతి నెమలి, పావాక్రిస్టాటస్ వర్ణరంజితమైన, హంస పరిమాణంలో ఉండే పక్షి ఇది భారతదేశం యొక్క జాతీయపక్షి. ఇది విసనకర్రలా ఉండే ఈకలతో, కంటి క్రింద ఒకతెల్లని మచ్చతో పొడవైన నాజూకైన మెడతో ఉంటుంది. మగజాతి నెమలి, ఆడజాతి నెమలి కంటే అందంగా, మెరిసే నీలం రంగు ఛాతీ, మెడ కలిగి, కంటికి యింపైన కంచు- ఆకుపచ్చ రంగులో దాదాపు రెండువందల పొడవైన ఈకలతో ఉండే పింఛం తో ఉంటుంది. ఆడ నెమలి గోధుమ రంగులో మగ నెమలి కంటే చిన్నగా ఉండి, తోక లేనిదై ఉంటుంది. మగ నెమలి సర్వాంగ సుందరమైన ప్రణయనృత్యంతో తన తోకను విసనకర్రలా విప్పి ఈకలను సవరించుకునే విధానం ఒక కమనీయమైన దృశ్యం. 

జాతీయ పుష్పం

కమలం (నిలుంబా న్యూసిపెరా గెయార్టిన్) భారతదేశం యొక్క జాతీయ పుష్పం ఇది పవిత్రమైనది మరియు, ప్రాచీన భారతదేశంలో కళ, పురాణాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉండి, ఒక శుభ సంకేతంగా భారత సంస్కృతిలో కాలాతీతంగా నిలిచి ఉంది.
national-flower-lotus.gif
భారతదేశం, వన సంపదలో సుసంపన్నమైనది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో పదో స్థానంలోనూ, ఆసియాలో నాలుగో స్థానంలోనూ ఉంది. భౌగోళిక ప్రాంతంలో యిప్పటి వరకూ, సర్వే జరిపిన 70 శాతం ప్రాంతంలో 47,000 రకాల మొక్కలు ఉన్నట్లు బొటానికల్ సర్వే ఆఫ్ యిండియా (భారతదేశ వృక్ష అధ్యయన కేంద్రం - BSI )ప్రకటించింది.


జాతీయ వృక్షం

NationalTreeofIndia.gif
భారత్ ఫిగ్ చెట్టు (ఫికస్ బెంగాలెన్సిస్ ) దీని యొక్క కొమ్మలు మళ్ళీ క్రొత్త చెట్లుగా ఏర్పడి ఎంతో ప్రాంతానికి విస్తరిస్తుంది. దీని వేళ్ళు మళ్ళీ క్రొత్త చెట్లు మొదలుగా, కొమ్మలుగా ఏర్పడతాయి. ఈ లక్షణం కారణంగానూ, దాని యొక్క జీవితకాలం కారణంగానూ, ఈ వృక్షం అమరమైనదిగా భావించి, భారతపురాణాల్లో, ఇతి హాసాల్లో ఒక అంతర్గమైన భాగంగా ఉంది. ఈ రోజుల్లో కూడ, మర్రి చెట్టు గ్రామీణ జీవితంలో ఒక ముఖ్యమైన కేంద్రం గ్రామ సభలు ఈ చెట్టు నీడ క్రిందే నిర్వహించబడతాయి.

జాతీయగీతం

అనేక సందర్భాలలో భారతదేశపు జాతీయగీతం వాయిస్తారు, లేక ఆలపిస్తారు జాతీయగీతం యొక్క సరియైన పాఠాన్ని వివరణలతో, ఏ సందర్భాలలో గీతాన్ని పాడాలో, లేక వాయించాలో, ఏ విధమైన ప్రవర్తన నియమావళి ఆ సమయాల్లో జాతీయగీతానికి మర్యాద పూర్వకంగా పాటించాలో ఎప్పటికప్పడు సూచనలు వెలువడతాయి ఈ సూచనల యొక్క సారాంశం, ఈ సమాచార పత్రంలో, సామాన్య సమాచారం మరియు మార్గనిర్దేశికంగా పొందు పరచబడింది.
జాతీయగీతం – పూర్తిగా మరియు క్లుప్తంగా
ఈ రచన, స్వర్గీయ రచయత రవీంద్రనాధ్ ఠాగూర్ గీతం, జనగణమన అనుపాట లో నుంచి తీసుకున్న మొదటి నాలుగు పంక్తుల్లోని పదాలు మరియు సంగీతం దీనిని భారతదేశపు జాతీయగీతంగా తీసుకున్నారు. ఇది ఈ విధంగా చదవబడుతుంది.
జన- గణ- మన- అధినాయక, జయహే
భారత- భాగ్య- విధాత
పంజాబ్- సింధ్- గుజరాత్- మరాఠా
ద్రావిడ- ఉత్కళ- వంగా
వింధ్య- హిమాచల- యమునా- గంగా
ఉచ్ఛల- జలధి- తరంగా
తవశుభ నామే జాగే
తవశుభ ఆశిశ మాంగే
గాహే తవ జయ గాధా
జన-గణ- మంగళ-దాయక జయహే
జయ జయ జయ, జయహే!

పైన పేర్కొనది జాతీయగీతం యొక్క పూర్తిపాఠం పాడే సమయం సుమారు ఏభై రెండు సెకన్లు సంక్షిప్తంగా మార్చిన మొదటి మరియు చివరి పంక్తులు మాత్రమే కలిగిన జాతీయగీతాన్ని కూడ కొన్ని సందర్భాలలో వాడతారు. అది ఈ విధంగా ఉంటుంది.
జన- గణ- మన- అధినాయక, జయహే
భారత- భాగ్య- విధాత
జయహే, జయహే, జయహే
జయ జయ జయ, జయహే!

చిన్నదిగా ఉన్న జాతీయగీతం పాడడానికి పట్టే సమయం సుమారు ఇరవై సెకన్లు

జాతీయ గేయం

వందేమాతరం అను గేయాన్ని సంస్కృతంలో బకించంద్ర ఛటర్జీ రచించారు. ఈ గేయం, స్వాతంత్ర సమర కాలంలో ప్రజలకు ప్రేరణ శక్తిగా నిలిచింది. ఈ గేయం, జన-గణ- మన జాతీయ గీతంతో సమానమైన హాదా కలిగి ఉంది. రాజకీయంగా ఈ గేయం మొదటిసారిగా, భారత జాతీయ కాంగ్రెస్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) 1896 నాటి సమావేశంలో పాడబడింది. దిగువ వ్రాసినది గేయం యొక్క మొదటి నాలుగు పంక్తుల పాఠం
వందేమాతరం!
సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం,
సస్యశ్యామాలాం మాతరం!
వందేమాతరం!
శుభ్రజ్యోత్స్నా, పులకిత యామినిమ్
ఫుల్లకు సుమితా ద్రుమదళ శోభినిమ్
సుహాసీనిమ్ సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం
శ్రీ అరబిందో వ్రాసిన గద్యభాగం 1 లో నుంచి ఆంగ్లంలో ఈ పంక్తుల అనువాదం తీసుకొనబడింది.


జాతీయనది

national_river.gif
గంగానది లేక గేంజస్ భారతదేశంలోని అతి పొడవైన నది. పర్వతాలు, లోయలు, మైదానాలు వెంబడి 2,510 కి.మీ లు దూరం ప్రవహిస్తుంది. ఇది హిమాలయాల్లోని గంగోత్రి హిమనది ప్రాంతంలోని మంచు భూభాగంలో భాగీరధి నదిగా జన్మిస్తుంది. తరువాత ఈ నదిలో అలకనంద, యమున, సోన్, గుమ్టి, కోసి మరియు ఘాగ్రా అనే నదులు కలుస్తాయి. గంగానదీ పరివాహక ప్రాంతం, ప్రపంచంలోనే అతి సారవంతమైన మరియు జనాభా సాంద్రత కలిగిన 1,000000 చ.కి.మీ.ల ప్రాంతం ఈ నది మీద రెండు ఆనకట్టలు (డ్యాములు) ఉన్నాయి. ఒకటి హరిద్వార్ లోనూ, మరోకటి ఫరక్కాలోనూ ఉన్నాయి. గంగానది డాల్పిన్ ఈ నది ప్రాంతంలోనే జీవించే జంతువు, యిప్పడు కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. ఈ భూమి మీద ప్రవహించే నదుల్లో గంగానదిని అతి పవిత్రమైన నదిగా హిందువులు గౌరవిస్తారు. ముఖ్యమైన మత ధార్మిక సంబంధమైన కార్యక్రమాలు, ఈ నది ఒడ్డునగల పట్టణాలు, వారణాసి, హరిద్వార్ మరియు అలహాబాద్ లలో నిర్వహిస్తారు. గంగానది, గంగా డెల్టా ప్రాంతమైన బంగ్లాదేశ్ లోని సుందర్ బాన్స్ బురద నేలల్లో పూర్తిగా విస్తరించి, చివరకు తన ప్రయాణాన్ని ముగించి బంగాళాఖాతం సముద్రంలో కలిసిపోతుంది.

జాతీయ చిహ్నం

State-emblem.gif
రాష్ట్ర చిహ్నం అశోకుడి సారనాధ్ సింహస్థూపం నుండి గ్రహించబడినది మాతృకలో నాలుగు సింహాలు, వాటి వెనుక వైపులు ఎదురెదురుగా ఉండి ఒక స్తంభాగ్రాన నిలిచి ఉండి, వాటికి ఉపరితలానికి మధ్య ఉబ్బెత్తు శిల్పాలుగా ఒక ఏనుగు, ఒక కదం తొక్కుతున్న గుర్రం, ఒక ఎద్దు మరియు, ఒక సింహం, వాటి మధ్యలో చక్రాలు, ఒక ఘంటాకారపు పద్మం మీదనిలచి ఉంటాయి. ఒకే ఒక్క నున్నగా చేయబడిన ఇటుకరాయి మీద యివన్నీ చెక్కబడి స్తంభాగ్రం, ధర్మచక్రంతో శిఖరంగా నిలబడి ఉంటుంది. రాష్ట్ర చిహ్నంలో 1950 జనవరి 26న భారతదేశపు ప్రభుత్వం స్వీకరించిన ప్రకారం, మూడు సింహాలు మాత్రమే కనబడతాయి.నాల్గవ సింహం దృష్టికి అందకుండా ఉంటుంది. చక్రం స్తంభాగ్రాన మధ్యలో కుడివైపు ఒక ఎద్దు, ఎడమ వైపు ఒక గుర్రంతో ఉబ్బెత్తు శిల్పంగా చెక్కబడినవి ఉండి, మిగిలిన చక్రాలు కుడివైపు, ఎడమ వైపు చివరలలో రేఖా మాత్రంగా ఉంటాయి. ఘంటాకారపు పద్మం మాత్రం వదిలివేయబడింది. సత్యమేవ జయతే అనే ఉపనిషత్తు నుండి తీసుకున్న పదాలు, వాటి అర్థం నిజమే గెలుస్తుంది. అన్నవి స్తంభాగ్రం క్రింది వైపు దేవనాగరిలిపి లో వ్రాయబడి ఉన్నాయి.

జాతీయ కేలండర్

జాతీయ కేలండర్ శక, శకం మీద ఆధారపడి తయారుచేయబడింది. చైత్రం మొదటి నెలగా, 365 రోజులు ఒక సామాన్య సంవత్సరంగా పరిగణించి 22 మార్చి 1957 లో తయారుచేయబడింది. దీనితో పాటు గ్రిగోరియన్ కేలండర్ కూడ క్రింద పేర్కొనబడిన ప్రభుత్వ అవసరాల కోసం వినియోగిస్తారు.
  1. ఇండియా గజిట్ ( భారత ప్రభుత్వ పత్రిక)
  2. అఖిల భారత రేడియో ప్రసార కేంద్రాల నుండి వచ్చే వార్తలు
  3. భారతదేశ ప్రభుత్వం విడుదల చేసిన కేలండర్లు మరియు
  4. ప్రభుత్వం ప్రజలను ద్దేశించి చేసే ప్రసంగాలు
జాతీయ కేలండర్ లోని తేదీలు, గ్రిగోరియన్ కేలండర్ లోని తారీకులకు శాశ్వశంగా అనుగుణంగా ఉంటాయి. ఉదాహరణకు, సాధారణంగా 1 చైత్రం 22 మార్చిన మొదలవడం, లీపు సంవత్సరంలో 21 మార్చిన రావడం.

జాతీయ ఫలం

National-Fruit.gif
ప్రపంచంలోని, ఉష్ణమండదేశాల్లో, విస్తారంగా పండించబడే అతి ముఖ్యమైన ఫల పంట మామిడి (మాంగిఫరా యిండిలే) యొక్క పండు పుష్టి కలిగిన పండు ఇది, నేరుగా పండులా తినవచ్చు లేదా ఊరగాయలు మొదలైన వాటికి పచ్చడి మామిడి కాయలను ఉపయోగించవచ్చు. దీనిలో రసం కలిగిన పండు విటమిన్లు ఎ, సి, డి లను పుష్కలంగా కలిగి ఉంది. భారతదేశంలో వంద రకాలకు పైగా మామిడి వివిధ పరిమాణాల్లో రూపాల్లో లభ్యమౌతుంది. చిరకాలం నుండి మామిడి భారతదేశంలో సాగు చేయబడుతుంది. కవి కాళిదాసు, తన కవిత్వంలో ఈ పండు యొక్క ప్రాశస్యాన్ని కీర్తించాడు. అలెగ్జాండరు, చైనీయుల యాత్రికుడైన హ్యూయాన్ ల్సాంగ్ కూడా దీని రుచిని ఆస్వాదించారు. మొఘల్ చక్రవర్తి అక్బర్, 100000 మామిడి చెట్లను బీహార్ లోని దర్భాంగా లో నాటించాడు. ఇప్పుడు ఆ తోట, లఖీబాగ్ అని పిలవబడుతుంది.

జాతీయ క్రీడ

National-Game.gif
హాకీ క్రీడలో మాత్రం భారతదేశం క్రీడా మైదానాన్ని ఏలింది. మన దేశానికి, ఎనిమిది ఒలపింక్ బంగారు పతకాలు గెలిచిన అద్భుతమైన చరిత్ర ఉంది. భారతదేశపు హాకీ స్వర్ణ యుగం 1928- 56 లలో భారతదేశపు హాకీ జట్టు వరుసగా ఆరు ఒలపింక్ బంగారు పతకాలను సాధించినపుడు వచ్చిందని చెప్పవచ్చు. జట్టు 1975 ప్రపంచ కప్పు తో పాటు మరి రెండు పతకాలు కూడా గెలిచింది. భారతదేశపు హాకీ హాకీ క్రీడా సమాఖ్య, ప్రపంచ గుర్తింపు 1927లో పొంది అంతర్జాతీయ హాకీ సమాఖ్యలో చేరింది. ఈ విధంగా భారతదేశపు హాకీ సమాఖ్య చరిత్ర ప్రారంభమై భారతదేశం ఒలంపిక్స్ లో అడుగుపెట్టి, బంగారు శకం మొదలు పెట్టింది. ఆ క్రీడాయాత్ర బ్రహ్మాండమైన విజయం సాధించింది. భారతదేశం 21 మ్యాచ్ లలో 18 గెలుపొందింది. అంతేకాక ప్రసిద్ధి చెందిన ధ్యాన్ చంద్, అందరి దృష్టి ఆకర్షించేటట్లు భారతదేశం సాధించిన 192 గోల్స్ లో 100 గోల్స్ కు పైగా అతడే చేశాడు ఈ ఆట జయించడం అమ్ స్టర్ డామ్ లో 1928లో ప్రారంభమై, భారతదేశం గెలిచే క్రమంలో 1932 లో లాస్ ఏంజల్స్ లోనూ, 1936లో బెర్లిన్ లోనూ హ్యాట్రిక్ (వరుసగా మూడు) ఒలపింక్ బంగారు పతకాలు సాధించింది. భారతదేశ స్వాతంత్ర సముపార్జన తరువాత – భారత జట్టు, మళ్ళీ యింకో మారు వరుసగా మూడు (హ్యాట్రిక్) బంగారు పతకాలను, 1948 లండన్ ఒలంపిక్స్, 1952 హెల్సెంకీ గేమ్స్ లోనూ, మరియు మెల్ బోర్న్ ఒలంపిక్స్ లోనూ సాధించింది. ఈ బంగారు శకంలో, భారతదేశం 24 ఒలపింక్ ఆటలు లో ఇరవై నాలుగు గెలిచి 178 గోల్స్ కు మించి సాధించి (7.43 గోల్స్ ఆట సగటుగా) కేవలం 7 గోల్స్ మాత్రమే వదిలివేసింది. మిగిలిన రెండు బంగారు పతకాలు భారతదేశానికి, 1964 టోక్యో ఒలంపిక్స్ లోనూ మరియు 1980 మాస్కో ఒలంపిక్స్ లోనూ వచ్చాయి.